మేజర్ డ్రగ్ ట్రాఫికింగ్ రింగ్ బస్ట్.. ముగ్గురు అరెస్ట్
- July 26, 2024
మనామా: ఇద్దరు సోదరులతో సహా ముగ్గురు వ్యక్తులపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా రింగ్‌కు సంబంధించిన కేసును హై క్రిమినల్ కోర్టు విచారణ ప్రారంభించింది. నిందితులు 30 నుంచి 20 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం.. నిందితులపై చట్టబద్ధమైన అనుమతి లేకుండా గంజాయిని దిగుమతి చేసుకోవడం, కలిగి ఉండటం, విక్రయించడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. విచారణ సందర్భంగా డ్రగ్స్ వాడుతున్నట్లు నిందితులు అంగీకరించారు. కానీ తాము విక్రయాలు చేయడం లేదని వారు పేర్కొన్నారు. వీరిని కింగ్ ఫహద్ కాజ్వే వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారివద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ విభాగంలోని టాక్సికాలజీ అండ్ డ్రగ్స్ లేబొరేటరీ నివేదిక ప్రకారం.. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులలో గంజాయి ఉన్నట్లు నిర్ధారించారు.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









