ఫేం శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో 'ఉపేంద్ర'
- June 15, 2016
టైటిల్ చూసి షాక్ అయ్యారా..అంతలా షాక్ అవ్వకండి గుండు కొట్టించింది నిజంగా కాదులెండి.."దండు పాళ్యం" అనే చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీనివాస్ రాజు, తన నూతన చిత్రం "బ్రాహ్మణ" గా వస్తున్నాడు..ఈ చిత్రం కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరో గా నటించాడు..ఇక ఈ చిత్ర పూర్తి డీటెయిల్స్ మీరే చూడండి.
"దండు పాళ్యం" చిత్రం అటు కన్నడలోనూ.. ఇటు తెలుగులోనూ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ రాజు మన తెలుగువాడన్న విషయం కూడా తెలిసిందే. "దండుపాళ్యం" అనంతరం శ్రీనివాస్ రాజు దర్సకత్వంలో.. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా రూపొందిన "శివం" చిత్రం సైతం అంతే సంచలనం సృష్టించింది.
ఆ చిత్రం ఇప్పుడు తెలుగులో "బ్రాహ్మణ" పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది.
సి.ఆర్.మనోహర్ సమర్పణలో.. విజి చెరిష్ విజన్స్ మరియు శ్రీ తారకరామ పిక్చర్స్ బ్యానర్స్ పై.. విజయ్.ఎమ్- గుర్రం మహేష్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుంటూరి కేశవులు నాయుడు సహ నిర్మాత. ఉపేంద్ర సరసన సలోని (మర్యాద రామన్న ఫేం), రాగిణి ద్వివేది హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి సంగీత సంచలనం మణిశర్మ స్వర సారధ్యం వహించడం విశేషం. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ట్రైలర్ ను ఈ నెల 16న రిలీజ్ చేయనున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. "కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రకు తెలుగులో గల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. "దండుపాళ్యం" ఫేం శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో రూపొంది.. కన్నడలో ఘన విజయం సాధించిన "బ్రాహ్మణ" తెలుగులోనూ డెఫినిట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం. ఈ చిత్రాన్ని భీమవరం టాకీస్ ద్వారా ఆంధ్ర- తెలంగాణాలలో అత్యధిక దియేటర్స్ లో విడుదల చేస్తున్నాం" అన్నారు.
మణిశర్మసంగీతం అందించగా సహనిర్మాత: గుంటూరి కేశవులు నాయుడు, సమర్పణ: సి.ఆర్.మనోహర్, నిర్మాతలు: విజయ్.ఎం- గుర్రం మహేష్ చౌదరి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ రాజు !!
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







