భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఐవరీ కోస్ట్ అత్యున్నత పురస్కారం
- June 15, 2016
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఐవరీ కోస్ట్ అత్యున్నత పురస్కారం దక్కింది. ప్రస్తుతం ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో ఆయన పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత రాత్రి అక్కడికి చేరుకున్న ప్రణబ్‌కి సాదర స్వాగతం లభించింది. అనంతరం ఆయన ఆ దేశాధ్యక్షుడు అల్సానే ఔట్టారా ఇచ్చిన విందులో పాల్గొన్నారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో అల్సారే.. ప్రణబ్‌కి వారి దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఈ విషయమై రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఈ పురస్కారాన్ని పొందడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఐవరీ కోస్ట్‌తో భారత్ స్నేహ బంధం దీర్ఘకాలం కొనసాగుతుందన్నారు.
ప్రణబ్‌కి ఇలాంటి పురస్కారం ఇదే మొదటిదని ప్రెస్ సెక్రటరీ వేణు రాజమోనీ వెల్లడించారు. రాష్ట్రపతికి ఇప్పటి వరకు గౌరవ డిగ్రీలు అనేకం వచ్చాయని అయితే ఒక దేశం నుంచి ఇలాంటి గౌరవం పొందడం ఇదే తొలిసారని చెప్పారు
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







