నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు

- July 27, 2024 , by Maagulf
నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు

యూఏఈ: యూఏఈలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు నవజాత శిశువుల స్క్రీనింగ్ కోసం కొత్త మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు ఆరోగ్యం మరియు నివారణ మంత్రిత్వ శాఖ (మోహాప్) ప్రకటించింది. దేశంలో జన్మించిన శిశువులకు వైద్య పరీక్షా విధానాలను మెరుగుపరిచే లక్ష్యంతో జాతీయ నవజాత స్క్రీనింగ్ మార్గదర్శకాలను ప్రారంభించింది. అవసరమైన లేబొరేటరీ, క్లినికల్ పరీక్షల జాబితాను ప్రామాణీకరించడం ద్వారా మరియు దేశవ్యాప్తంగా నియమించబడిన రిఫరెన్స్ లేబొరేటరీలను గుర్తించడం ద్వారా ఇది ముందస్తు ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.  “నవజాత శిశువుల ఆరోగ్యాన్ని నిర్ధారించడం అత్యంత ప్రాధాన్యత, తాజా అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉండే సమగ్ర నివారణ మరియు చికిత్సా ఆరోగ్య సేవలను అందించడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.’’ అని పబ్లిక్ హెల్త్ సెక్టార్ కోసం మొహప్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ హుస్సేన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ రాండ్ తెలిపారు. వైద్యుల ప్రకారం, శిశువు జన్మించిన 24 నుండి 48 గంటల తర్వాత మొదటి స్క్రీనింగ్ నిర్వహిస్తారని ఇంటర్నేషనల్ మోడ్రన్ హాస్పిటల్ దుబాయ్‌లో స్పెషలిస్ట్ పీడియాట్రిషియన్ మరియు నియోనాటాలజిస్ట్ డాక్టర్ మమతా బోత్రా వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com