'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- July 27, 2024
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు డల్లాస్, దుబాయ్ లలో నిర్మాణ రంగంలో గణనీయమైన విజయాలు నమోదు చేస్తున్న అన్వితా గ్రూప్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అవుట్ లుక్ బిజినెస్ స్పాట్ లైట్ రియాల్టీ అవార్డుల కార్యక్రమంలో మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు 2024ను సొంతం చేసుకుంది.హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణ వేదికగా శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ సినీ కధానాయిక శృతి హాసన్ చేతుల మీదుగా అన్వితా గ్రూపు ఎండి అచ్యుత రావు బొప్పన ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో నూతన అవిష్కరణల స్వీకరణ అనే అంశంపై జరిగిన చర్చలో అచ్యుతరావు బొప్పన మాట్లాడుతూ నూతనత్వాన్ని స్వాగతిస్తూ అంతర్జాతీయ పోకడలకు అనుగుణంగా మార్పుకు సిద్దం కావాలన్నారు. వినియోగదారుని ఆసక్తికి అనుగుణంగా భవన నిర్మాణాలు సాగినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయన్నారు.అన్వితా గ్రూపు రానున్న కాలంలో కోటి చదరపు అడుగుల విస్త్రీర్ణాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రానుందని వివరించారు. చర్చలో హానర్ హోమ్స్ డైరెక్టర్ స్వప్న కుమార్, నీమ్స్ బోరో గ్రూపు ఎండి కృష్ణ భగవాన్ పాల్గొన్నారు.అవుట్ లుక్ బిజినెస్ ఎడిటర్ సుచేతనా రాయ్ కీలకోపన్యాసం చేయగా, అన్వితా గ్రూపు డైరెక్టర్లు సరిత కాకర్ల, అనూప్ బొప్పన, అన్విత బొప్పన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







