‘బడ్డీ’గా అల్లు శిరీష్.! ఈ సారైనా రాణిస్తాడా.?

- July 27, 2024 , by Maagulf
‘బడ్డీ’గా అల్లు శిరీష్.! ఈ సారైనా రాణిస్తాడా.?

అల్లు వారి చిన్నబ్బాయ్ శిరీష్‌కి హీరోగా ఓ మంచి హిట్టు పడాల్సి వుంది. కష్టపడుతున్నాడు. కానీ, ఫలితం దక్కడం లేదు. మొన్నామధ్య ‘ఊర్వశివో రాక్షసివో’ అనే సినిమాతో వచ్చాడు.

ఇంకేముంది ఈ సినిమా అంత సూపర్ హిట్టూ, ఇంత బంపర్ హిట్టూ.. అంటూ పబ్లిసిటీ స్టంట్లు బాగా చేశారు. కానీ, సినిమాలో అంత విషయం లేదని ఆడియన్స్ తేల్చేశారు.

ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ‘బడ్డీ’ అనే సినిమాతో రాబోతున్నాడు అల్లు శిరీష్. ఓ టెడ్డీ బియర్ కథతో వస్తున్న ఈ సినిమా కథ, కథనం గతంలో ఆర్యన్ చేసిన సినిమాని పోలి వున్నప్పటికీ.. సినిమా ప్రోమోలు ఎట్రాక్టివ్‌గా కట్ చేశారు.

ఆగస్టు 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పిల్లల్ని ఎట్రాక్ట్ చేసే కంటెంట్.. అలాగే కావల్సినంత యాక్షన్ అండ్ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో వున్నాయని తెలుస్తోంది.

మరి, గ్యాప్ తీసుకుని వస్తున్న ఈ సినిమా అయినా అల్లు శిరీష్‌‌కి హిట్ ఇస్తుందా.? లేదో చూడాలి మరి. శాన్ అంటోస్ దర్శకత్వంలో తెరకెకక్కుతోన్న ఈ సినిమాలో గాయత్రీ భరద్వాజ్ శిరీష్‌కి జోడీగా నటిస్తుండగా, యంగ్‌స్టర్ అజ్మల్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. ఆగస్లు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘బడ్డీ’.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com