‘హిట్ 3’ కోసం నాని కసరత్తు గట్టిగానే.!
- July 27, 2024
నాని సొంత నిర్మాణ సంస్థ అయిన వాల్ పోస్టర్ బ్యానరలో తెరకెక్కిన ‘హిట్’ సినిమాలు ఇంతవరకూ సూపర్ హిట్స్‌గానే నిలిచాయ్. తొలి పార్ట్ సూపర్ హిట్‌గా నిలిచింది. మలి పార్ట్ సోసోగా ఆకట్టుకుంది.
కానీ, ఈ సిరీస్ సినిమాల కోసం డిఫరెంట్ పంథాని ఎంచుకున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ముఖ్యంగా హీరో రోల్స్ డిఫరెంట్‌గా డిజైన్ చేశాడు. ఫస్ట్ పార్ట్‌లో విశ్వక్ సేన్, రెండో పార్ట్‌లో అడవి శేష్ హీరోలుగా నటించగా.. మూడో పార్ట్ కోసం స్వయంగా నానినే రంగంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
ఈ మూడో పార్ట్ కోసం సిద్ధం చేసిన స్క్రిప్టులో నాని హస్తం కూడా వుందట. నాని ఇచ్చిన స్టోరీ లైన్‌నే శైలేష్ డెవలప్ చేశాడనీ తెలుస్తోంది.
అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది. ఈ లోపు నాని నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్







