అంతర్జాతీయ ఈఎన్‌టీ సమ్మిట్‌ నిర్వహించిన మెడికవర్ ‌ హాస్పటల్స్

- July 27, 2024 , by Maagulf
అంతర్జాతీయ ఈఎన్‌టీ సమ్మిట్‌ నిర్వహించిన మెడికవర్ ‌ హాస్పటల్స్

హైదరాబాద్: అంతర్జాతీయ, జాతీయ మరియు స్థానికంగా సర్వోన్నత నిపుణులను ఒకే చోటకు తీసుకువచ్చిన ఈ సదస్సులో యాంటీరియర్ స్కల్ బేస్, మిడిల్ ఇయర్, మాస్టాయిడ్, ఇన్నర్ ఇయర్ & ఇంప్లాంట్ మరియు ఎయిర్‌వే మేనేజ్‌మెంట్ వంటి క్లిష్టమైన ప్రాంతాలలో తమ నైపుణ్యం, పరిజ్ఞానంను కన్సల్టెంట్‌లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్‌లతో వారు పంచుకున్నారు.  

రైనాలజీ మరియు స్కల్ బేస్ సర్జరీలో ప్రఖ్యాత నిపుణులు, మలేషియాకు చెందిన ప్రొఫెసర్ ప్రిపేగెరన్ నారాయణ్ ఈ సదస్సులో పాల్గొనడం విశేషం.ఈ సదస్సులో ప్రొఫెసర్ నారాయణ్ మాట్లాడుతూ, "ఇఎన్‌టి రంగాన్ని అభివృద్ధి చేయడానికి, సహకారాన్నిపెంపొందించడానికి , ప్రాక్టీషనర్ల నైపుణ్యాలను పెంపొందించడానికి ఒక ముఖ్యమైన వేదికగా ఎలివేట్ ఇఎన్‌టి సమ్మిట్ నిలుస్తుంది.నా నైపుణ్యాన్ని పంచుకోవడం మరియు ఈ ముఖ్యమైన సమావేశానికి తోడ్పాటు అందించటాన్ని ఒక  గౌరవంగా భావిస్తున్నాను" అని అన్నారు.

ఇఎన్‌టి సర్జన్ డాక్టర్ సంపూర్ణ ఘోష్ ఈ సదస్సులో లైవ్ సర్జరీ ప్రకియలను నిర్వహించారు. డాక్టర్ ఘోష్ ఒక రోగికి లైవ్ సర్జరీ చేసి, అధునాతన పద్ధతులు మరియు ఉత్తమ ప్రక్రియలను ప్రదర్శించారు.ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ , "ప్రత్యక్ష ప్రదర్శనలు వైద్య విద్యలో ముఖ్యమైన భాగం, వీటిలో పాల్గొనేవారు వాస్తవ విధానాలను చూసేందుకు ,  నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ సదస్సుకు హాజరైనవారి ఉత్సాహం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది " అని అన్నారు. 

ఈయనతో పాటుగా ఫ్యాకల్టీ సభ్యులు కూడా  తమ  అభ్యాస అనుభవాలను సదస్సుకు హాజరైన వారికి చూపారు.మెడికవర్ హాస్పిటల్స్  డాక్టర్ శరత్ రెడ్డి ఎ - డైరెక్టర్ - CTO & కాంప్లెక్స్ కరోనరీ ఇంటర్వెన్షన్స్ మాట్లాడుతూ "మారుతున్న పరిస్థితులు, వస్తోన్న నూతన సాంకేతికతలలో అవసరమైన పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఎలివేట్ ఇఎన్‌టి సమ్మిట్ 2024 విజయం సాధించింది.సదస్సుకు హాజరైనవారు సంక్లిష్టమైన ఇఎన్‌టి విధానాలపై లోతైన పరిజ్ఞానం పొందటం తో పాటుగా అత్యాధునిక వైద్య విధానాల పట్ల అవగాహన కూడా పెంపొందించుకున్నారు" అని అన్నారు.

అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ సతీష్ కైలాసం మాట్లాడుతూ ఈ ఓటోలారిన్జాలజీ మరియు ఆడియాలజీలో నిపుణుల కోసం ఈ కాన్ఫరెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది, ENT రంగంలో సరికొత్త పురోగతుల గురించి తెలుసుకునే అవకాశాన్ని అందిస్తుంది. అధిక-నాణ్యత పరిశోధన ప్రదర్శనలు, ప్రయోగాత్మక వర్క్‌షాప్‌లు మరియు ప్రయోజనకరమైన నెట్‌వర్కింగ్ అవకాశాలను కలిగి ఉన్న విభిన్న ఎజెండాను హాజరైనవారు ఊహించగలరు. సమాచార సెషన్‌లను నిర్వహించడం మరియు సహకార చర్చలను ప్రోత్సహించడం ద్వారా రోగి సంరక్షణను మెరుగుపరచడం మా లక్ష్యం అని అన్నారు. 400 మందికి పైగా నిపుణులు మరియు యువ డాక్టర్స్ పాల్గొనటం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com