పారిస్ ఒలింపిక్స్‌లో పంచ్ పవర్ చూపించిన భారత బాక్సర్ నిఖత్ జరీన్
- July 28, 2024
            పారిస్: పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ నిఖత్ జరీన్ పంచ్ పవర్ చూపించింది. 50 కిలోల విభాగంలో శుభారంభం చేసి 16వ రౌండ్లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన బౌట్లో జర్మనీ బాక్సర్ మాక్సీ కరినా క్లొయెట్జర్ ను నిఖత్ చిత్తుగా ఓడించింది. ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించిన తెలంగాణ బిడ్డను జడ్జిలు ఏకగ్రీవంగా విజేతగా ప్రకటించారు.
ఒలింపిక్స్‌లో కఠినమైన ప్రత్యర్థుల గ్రూప్‌లో ఉన్న నిఖత్ జరీన్ తొలి అడుగు ఘనంగా వేసింది. ఆరంభం నుంచే మాక్సీపై విరుచుకుపడింది. దాంతో, మ్యాక్సీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ఏకపక్ష పోరులో నిఖత్ 5-0తో గెలుపొందింది. ఆగస్టు 1న జరిగే తర్వాతి రౌండ్లో ఆమె చైనా బాక్సర్ వు యూతో తలపడనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 - తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్‌లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 







