మాన్యు స్క్రిప్ట్‌ల పరిరక్షణకు కొత్త ఎక్విప్‌మెంట్‌

- June 15, 2016 , by Maagulf
మాన్యు స్క్రిప్ట్‌ల పరిరక్షణకు కొత్త ఎక్విప్‌మెంట్‌

మినిస్ట్రీ ఆఫ్‌ హెరిటేజ్‌ అండ్‌ కల్చర్‌, రెండు స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ డివైజెస్‌ని సౌత్‌ కొరియా నుంచి కొనుగోలు చేసింది. మాన్యు స్క్రిప్ట్‌ని భద్రపరచడానికి వీటిని ఉపయోగిస్తారు. ఈ ఎక్విప్‌మెంట్‌ ఖరీదు 20,000 ఒమన్‌ రియాల్స్‌. 4,857 మాన్యు స్క్రిప్ట్‌లను భద్రపరిచేందుకు, వాటిని పరిరక్షించేందుకు ఈ ఎక్విప్‌మెంట్‌ ఉపయోగపడనుంది. పురుగులు, చెత్త, ఫంగస్‌ మరియు బ్యాక్టీరియా కారణంగా విలువైన మాన్యు స్క్రిప్ట్‌లు పాడైపోతున్నాయి. అలా పాడవకుండా ఈ కొత్త ఎక్విప్‌మెంట్‌తో మాన్యు స్క్రిప్ట్‌లను కాపాడుకోవచ్చు. మాన్యు స్క్రిప్ట్‌ మానవాళి సంపద అని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. మాన్యుస్క్రిప్ట్‌ స్టెరిలైజేషన్‌ కోసం అల్తాముల్‌ మరియు ఇథోలీన్‌ ఆక్సైడ్‌ని వినియోగిస్తారు. అయితే ఈ రసాయనాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుని, ఎలాంటి నష్టం లేకుండా వాటిని వినియోగించనున్నామని అధికారులు చెప్పారు. 200 పేజీల మాన్యు స్క్రిప్ట్‌ని స్టెరిలైజ్‌ చేయడానికి నాలుగైదు రోజుల సమయం సరిపోతుంది. ఆరవ శతాబ్దానికి చెందిన మాన్యు స్క్రిప్ట్‌ని భద్ర పరిచేందుకు ఇది సరైన మార్గమని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com