వెనిజుల అధ్యక్షుడిగా మరోసారి నికోలస్...
- July 29, 2024
కారకాస్: వెనెజువెలా అధ్యక్షుడిగా నికోసల్ మడురో మరోసారి భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. ఈవిషయాన్ని ఆ దేశ నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్ అధిపతి ఎల్విస్ అమోరోసో ప్రకటించారు. మొత్తం 80శాతం ఓట్లను లెక్కించగా మడురోకు 51.20శాతం పోలైనట్లు తేలింది. ఆయన ప్రధాన ప్రత్యర్థికి కేవలం 44.02శాతమే లభించాయి.
ఈ ఎన్నికల కౌంటింగ్‌లో భారీగా అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఫలితాలను న్యాయస్థానంలో సవాలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నీ తమ అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు మద్దతుగా ఏకమయ్యాయి. ప్రతిపక్షం ఇప్పటికే ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద వేల మంది మద్దతుదారులను పిలిపించాయి. వారు కౌంటింగ్‌ను ప్రత్యక్షంగా వీక్షించి ఫలితాలను ప్రకటించేందుకు ఇలా చేసింది. కానీ, పోలీసులు చాలా కేంద్రాల నుంచి వీరిని వెళ్లగొట్టారని గోంజాలెజ్ వర్గం వెల్లడించింది.
ఆదివారం అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. వేతనాల్లో కోత, ఆకలికేకలు, వలసలు, చమురు పరిశ్రమలో సంక్షోభం వంటి సమస్యలతో కునారిల్లుతున్న వెనెజువెలాలో మొత్తం ఓటర్లు దాదాపు 1.70 కోట్లు. ప్రజా వ్యతిరేకతను మడురో కూడగట్టుకొన్నట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. బరిలో ఎనిమిది మంది అభ్యర్థులున్నా మడురో, గొంజాలెజ్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. ఎన్నికల ముందు జరిగిన ఒపీనియన్ పోల్స్‌లో మడురోపై గోంజాలెజ్‌కు స్పష్టమైన ఆధిక్యం లభించింది. అధికారిక సోషలిస్టు పీఎస్‌యూవీ పార్టీని మార్చాలని తాము భావిస్తున్నట్లు స్పష్టంగా చెప్పారు.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







