ఖతార్‌లో పారిశ్రామిక వృద్ధిలో ఆర్థిక వైవిధ్యత..!
- July 29, 2024
దోహా: ఖతార్ నేషనల్ విజన్ 2030 హైడ్రోకార్బన్‌లపై తక్కువ ఆధారపడే ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఖతార్ ఆర్థిక వైవిధ్య ప్రయత్నాలలో ఖతార్ తయారీ రంగం ప్రధాన చోదక శక్తిగా నిల్వనుంది. ఏడాది ప్రథమార్థంలో తయారీ రంగం పనితీరును హైలైట్ చేస్తూ వ్యాపారవేత్త, పరిశ్రమ నిపుణుడు ఖలీద్ అల్ బుయైనన్.. మొత్తం పారిశ్రామిక సంస్థల సంఖ్య పెరగడం ఈ రంగంలో జరుగుతున్న అభివృద్ధికి స్పష్టమైన సూచన అని అన్నారు. గింజలు, టీ, నూనెలు మరియు చక్కెర కోసం కర్మాగారాల పెరుగుదల స్వయం సమృద్ధి స్థాయిని సూచిస్తుందన్నారు.
ఖతార్ ఇండస్ట్రియల్ పోర్టల్ డేటా ప్రకారం ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో 967 సంస్థలు మరియు 481 లైసెన్స్ పొందిన పారిశ్రామిక సౌకర్యాలు నమోదయ్యాయి. గత దశాబ్దంలో పారిశ్రామిక రంగం వృద్ధి మరియు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉందని గణాంకాలు, సూచికలు చెబుతున్నాయి. అదే సమయంలో మొదటి అర్ధభాగంలో నమోదిత సంస్థలలో మొత్తం పెట్టుబడులు QR229.868bn మరియు లైసెన్స్ పొందిన సంస్థలలో QR3.248bnకు చేరాయి. ఈ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఒమన్, కువైట్, సౌదీ అరేబియా మరియు ఇతర ప్రదేశాలలో జరిగిన మేడ్ ఇన్ ఖతార్ ఎగ్జిబిషన్‌లో ఖతార్ ఉత్పత్తులను ప్రదర్శించారని ఖలీద్ అల్ బుయైనన్ వివరించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







