ఖర్జూర బర్ఫీ

- June 15, 2016 , by Maagulf
ఖర్జూర బర్ఫీ

కావలసినవి:  ఖర్జూరపళ్లు అర కేజి, చక్కెర 150 గ్రా., పచ్చి కోవా 200 గ్రా., పాలు ఒక కప్పు, డ్రింకింగ్‌ చాకొలేట్‌ పౌడర్‌ ఒక టేబుల్‌ స్పూను, నెయ్యి 2 టేబుల్‌ స్పూన్లు, చిన్నగా తరిగిన జీడిపపలు, బాదం పప్పులు కొద్దిగా.

ఎలా చేయాలి
ఖర్జూర పళ్లలో గింజలు తీసివేసి రెండు గంటల పాటు పాలలో నానబెట్టాలి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నెయ్యిని వేడి చేసి ఖర్జూర మిశ్రమం, చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర కరిగాక పచ్చి కోవా, డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు వేయాలి. ఈ మిశ్రమమంతా దగ్గర పడేవరకు ఆపకుండా కలుపుతూ ఉండాలి. చివర్లో చాకొలేట్‌ పౌడర్‌ వేసి బాగా కలిపి కిందికి దించాలి. నెయ్యి పూసిన ప్లేటులో ఈ మిశ్రమాన్ని వేసి సమానంగా సర్దాలి. చల్లారాక ఇష్టమైన విధంగా ముక్కలు కోసుకోవాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com