నకిలీ పాస్‌పోర్ట్.. 75 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి 3 ఏళ్ల జైలుశిక్ష

- July 31, 2024 , by Maagulf
నకిలీ పాస్‌పోర్ట్.. 75 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి 3 ఏళ్ల జైలుశిక్ష

మనామా: నకిలీ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి బహ్రెయిన్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు 75 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన మార్చి 22న బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.

మొదట ఆరోపణలను తిరస్కరించిన నిందితుడు.. సమగ్ర విచారణ తర్వాత దోషిగా తేలాడు. దేశంలోకి ప్రవేశించే ప్రయత్నంలో నకిలీ ఎలక్ట్రానిక్ పత్రాన్ని, ప్రత్యేకంగా పాస్‌పోర్ట్‌ను ఉపయోగించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై అభియోగాలు మోపింది. విచారణలో తప్పుడు డేటాను ప్రవేశానికి ఉపయోగించినట్టు, నకిలీ పాస్‌పోర్ట్‌ను పాస్‌పోర్ట్ ను ఉపయోగించినట్టు అంగీకరించాడు. తదుపరి విచారణలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ నుండి వచ్చిన నివేదిక, అలాగే యూరోపియన్ ఎంబసీ నుండి వెరిఫికేషన్ ద్వారా పాస్‌పోర్ట్ ఫోర్జరీని నిర్ధారించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com