సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీ జోన్ వారి రమదాన్ వితరణ
- July 04, 2015
రమదాన్ సంబరాలలో భాగంగా, సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీ జోన్ వారి తరపున పోర్ట్ సి. ఈ. ఓ. ఆండ్రే టొయెట్ తో కలసి వాలీ ఆఫ్ లీవ - హెచ్. ఈ. షేక్ సయ్యద్ బిన్ హుమైద్ అల్ హార్తీ స్థానికప్రజలకు వందల సంఖ్యలో గిఫ్ట్ వోచర్లను పంపిణీచేశారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విజయవంతమైన ఈ కాం పైన్ గురించి టొయెట్ మాట్లాడుతూ, తమ కంపెనీ సుస్థిర వ్యాపారానికి సహాయమందించిన స్థానిక సమాజానికి సహాయపడడం తమ భాద్యత అని, ఇస్లాంలో దాన ధర్మాలు చేయడానికి రమదాన్ సరైన సందర్భమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2500 మంది లబ్దిపొందినట్టు తెలిపారు. కేవలం 3.5 మిలియన్ జనాభాతో, గత 40 సంవత్సరాలలో అధికంగా అభివృద్ధి చెందిన దేశంగా - చైనా, నేపాల్, ఇందోనేషియా మరియు సమీప సౌదీ అరబియాలకంటే ఒమాన్ ముందుంది. ఆర్ధిక రంగాన్ని విస్తరించి, తద్వారా ఉద్యోగాలను కల్పించడమనే వ్యూహంలో భాగంగా, ఇది 1000 శాతం అభివృద్ధిని నమోదు చేసింది.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







