గద్దర్ అవార్డ్ లపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి స్పందన

- July 31, 2024 , by Maagulf
గద్దర్ అవార్డ్ లపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి స్పందన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీ మరింత అభివృద్ధికి తోడ్పడుచున్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము.ముఖ్యమంత్రిని కలిసి ఫిలిం ఇండస్ట్రీకి చెందిన విషయముల గురించి వివరముగా చర్చించిన మీదట ఎన్నో సంవత్సరముల నుండి పెండింగ్ లో వున్న అవార్డ్స్ మీద ముఖ్యమంత్రి  "గద్దర్ అవార్డ్స్" పేరు మీద ఇక నుండి ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వగలమని తెలియచేయగా ఫిలిం ఇండస్ట్రీ వారు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.ఈ విషయం మీద తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో అవార్డ్స్ కు సంబంధించిన కమిటీ గురించి చర్చించడం జరిగిందని, దీని మీద తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి మరియు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి వారు ఒక కమిటీ ని నియమించి సదరు విధి విధానాలను తయారు చేసి, ఆ విధి విధానాలను తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి అతి త్వరలో అందజేయడం జరుగుతుందని తెలియచేయుచున్నాము.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com