కేంద్ర మంత్రి రామ్మోహన్ కి ప్రవాసుల డిమాండ్

- August 01, 2024 , by Maagulf
కేంద్ర మంత్రి రామ్మోహన్ కి ప్రవాసుల డిమాండ్

న్యూ ఢిల్లీ: విశాఖపట్నం టూ దుబాయ్ వయా హైదరాబాద్ విమాన సర్వీస్ 2013-2020 వరకు అంటే కోవిడ్ సమయం వరకు సజావుగా నడిచింది. 

2020లో కోవిడ్ తీవ్రత మూలంగా విమానయాన సేవలు ఆపేయడం జరిగింది. కరోనా తర్వాత కూడా ఎయిర్ ఇండియా ఈ రూట్ విమాన సర్వీస్ ను తిరిగి పునరుద్ధరణ చేయలేదు. 

ఎయిర్ ఇండియా/ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రైవేటైయిజ్ కావడం వల్ల ఈ రూట్ పునరుద్దరణకు కొత్త ఎయిర్ ఇండియా యాజమాన్యం సుముఖత చూపలేదు. ఎంత ప్రయత్నం చేసినా కూడా బీ టౌన్ కావడం వల్ల యాజమాన్యం ఈ  విమాన సర్వీస్ ను  పునరుద్ధరణ చేయలేదు.  

అదృష్టవశాత్తు తెలుగు వాడైన కింజరపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి కావడం వల్ల శుక్రవారం, 26 జులైన వారిని కలిసి దుబాయ్ విశాఖపట్నం ట్రావెలర్స్ ఫోరమ్ తరుపున విమాన సర్వీస్ పునరుద్ధరణ చేయమని విన్నపాన్ని శరత్ యలవర్తి అందజేశారు. 

వారు సహృదయంతో మా విన్నపాన్ని స్వీకరించి అతి త్వరలోనే శాఖా పరంగా చర్యలు తీసుకోవడానికి సుముఖుత చూపించారని శరత్ యలవర్తి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com