ముంబై కోర్టు వర్మకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది
- June 15, 2016
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ వివాదాలకు కేంద్రబింధువుగా నిలిచే రాంగోపాల్ వర్మ గత కొంత కాలంగా ట్విట్టర్ వేదికగా చేసుకొని చిత్ర విచిత్రమైన కామెంట్స్ చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదలు కేంద్ర మంత్రుల వరకు రాజకీయంగా కామెంట్స్ చేశాడు. సినిమా హీరోలపై ట్వీట్స్ చేయకుండా వర్మ ఉండలేడు. సమాజంలో జరిగే ప్రతి దానిపై అయన సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉంటాడు. అంతే కాదు ఆ మద్య ఓ మహిళా ఎమ్మెల్య అందంపై కూడా స్పందించి కామెంట్స్ చేయడంతో పెద్ద గందరగోళమే చెలరేగింది.
ఇక పవన్ కళ్యాన్, మహేష్ బాబు ల గురించి కామెంట్స్ చేసి వారి అభిమానుల ఆగ్రహానికి బలైయ్యాడు..ఫేస్ బుక్ లో ఆయన మరణ వార్త వేయగా దానిపై కూడా రివర్స్ కామెంట్స్ చేస్తూ ఇలాంటి అదృష్టం ఎవరికి వస్తుంది అన్నారు.ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పై కామెంట్స్ చేస్తూ..అమితా బచ్చన్ చేసిన సినిమాలు రజినీ చేస్తే ప్రేక్షకులు నవ్వుకుంటారని చిరంజీవి, రజినీకాంత్ లు అమితాబ్ ను చూసి చాలా చేర్చుకోవాలని హితబోద చేశాడు.తాజగా ముంబై కోర్టు వర్మకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది..ఆ మద్య గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా వినాయకుడిని ఎగతాళి చేస్తూ వర్మ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై ముంబైలోని అంధేరి కోర్టు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై స్పందించి, కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. జూలై 19లోగా వర్మ కోర్టుకు హాజరు కావాలని లేదంటే తన న్యాయవాది ద్వారా స్పందించాలని కోర్టు తెలిపింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







