యూఏఈలో విమాన ఛార్జీలు రెట్టింపు..!
- August 02, 2024
యూఏఈ: ఈ నెల చివరిలో స్కూల్స్ ప్రారంభానికి ముందే ఇన్‌బౌండ్ యూఏఈ విమాన ఛార్జీలు దాదాపు రెట్టింపు అవుతాయి. యూఏఈలో నివసించే కుటుంబాలు సెలవుల సమయంలో తమ స్వదేశాలకు వెళ్లి వచ్చే సమయం కావడంతో అధిక డిమాండ్ ఉండి విమాన ఛార్జీల పెరుగుదలకు కారణం అవుతుందని విమానయానరంగ నిపుణులు చెబుతున్నారు. యూఏఈలో స్కూల్స్ ఆగస్టు 26న పునర్ ప్రారంభం కానున్నాయి. ఈ నేఫథ్యంలో మిడిల్ ఈస్ట్, ఆసియా మరియు యూరప్‌లోని అనేక గమ్యస్థానాలలో డిమాండ్ అధికంగా ఉండటంతో ఇన్‌బౌండ్ విమాన ఛార్జీలు పెరిగాయని దుబాయ్‌లోని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు.
యూఏఈ జనాభాలో సగానికి పైగా దక్షిణాసియా జాతీయులు ఉన్నందున భారత ఉపఖండంలోని మార్గాలలో కూడా విమాన ఛార్జీలలో పెద్ద పెరుగుదల కనిపించిందన్నారు. ముఖ్యంగా ముంబై, కేరళ వంటి భారతీయ రూట్లలో విమాన ఛార్జీలు 50 శాతానికి పైగా పెరిగాయని తెలిపారు. ఈ పీక్ సీజన్లో కొన్ని మార్గాల్లో విమాన ఛార్జీలు దాదాపు రెట్టింపు అవుతాయని Musafir.com వద్ద కార్యకలాపాల వైస్ ప్రెసిడెంట్ రషీదా జాహిద్ తెలిపారు. డేరా ట్రావెల్ అండ్ టూరిస్ట్ ఏజెన్సీ జనరల్ మేనేజర్ TP సుధీష్ మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుండి సెప్టెంబరు ప్రారంభం వరకు పీక్ సీజన్ ఉంటుందన్నారు. అదే విధంగా, ఆగస్టు చివరిలో వచ్చే విమానాలకు ఆఫ్రికన్ రూట్లలో కూడా భారీ డిమాండ్ ఉందని సుధీష్ తెలిపారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







