‘బిగ్’ ఛాన్స్.! మొన్న మెగాస్టార్తో ఇప్పుడు నటసింహం బాలయ్యతో.!
- August 03, 2024
సోషల్ మీడియాలో వీడియోలూ, ఫోటో షూట్లతో పాపులర్ అయిన దివి వైద్యకి బిగ్బాస్ రూపంలో ఓ మంచి ప్లాట్ఫామ్ దొరికింది. వున్నది తక్కువ రోజులే అయినా తిరుగులేని స్టార్డమ్, అపారమైన అభిమానం సంపాదించుకుంది బిగ్బాస్ షో ద్వారా దివి వైద్య.
హౌస్ నుంచి బయటికి వచ్చాకా అవకాశాలు కూడా బాగానే దక్కించుకుంటోంది. సోలో హీరోయిన్గా ‘లంబసింగి’ తదితర చిన్నా చితకా సినిమాలు చేస్తూనే కొన్ని బిగ్గెస్ట్ ఛాన్సెస్ కూడా బాగానే అందుకుంటోంది దివి వైద్య.
అలా దివి కెరీర్రలో ఓ బిగ్గెస్ట్ ఎచీవ్మెంట్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ పాదర్’ సినిమా. గుర్తుండిపోయే పాత్రలోనే తనదైన నటన ప్రదర్శించి మెప్పించింది దివి వైద్య.
ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ దక్కిందీ బిగ్బాస్ బ్యూటీకి. అదే నందమూరి నటసింహం బాలయ్య సినిమాలో. బాబీ డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో దివికి ఓ ఇంపార్టెంట్ రోల్ దక్కింది.
తాజాగా బాలకృష్ణతో కలిసి దివి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో దివి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ వుండబోతోందట. చూస్తుంటే, ముందు ముందు దివి వైద్య మరిన్ని క్రేజీ ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం
- సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!
- స్క్రబ్ టైఫస్తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!







