జైల్లో నాసిరకం ఫుడ్ పెడుతున్నారు..ఇమ్రాన్ ఖాన్ ఆరోపణ
- August 06, 2024
పాకిస్తాన్: ఏడాది కాలంగా జైలులో తనకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని పాక్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాకిస్తాన్ లోని పంజాబ్ సీఎం మర్యమ్ నవాజ్ ఆదేశాల మేరకే తనకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీని కారణంగా తన ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. వెంటనే హెల్త్ చెకప్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్ పార్టీ సోమవారం ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యి పూర్తయిన సందర్భంగా బ్లాక్ డేగా పాటించింది.190 మిలియన్ పౌండ్ల అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అరెస్టు చేసింది. ఈ సందర్భంగా పీటీఐ సీనియర్ నాయకుడు మూనిస్ ఎలాహి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో స్పందించారు. 'పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్ కు జైలులో నాసిరకం ఆహారం అందిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది.' అని తెలిపారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ మాత్రమే ఇంత నీచ స్థాయికి దిగజారుతుందని ఆయన దుయ్యబట్టారు. పాకిస్థాన్ ప్రజల హక్కుల కోసం ఏడాది పాటు జైలులో ఉండి ఇమ్రాన్ ఖాన్ ధైర్యాన్ని ప్రదర్శించారని మూనిస్ ఇలాహి చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తున్నాం.. అతనిపై పెట్టిన తప్పుడు కేసుల్లో అతన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. గత ఏడాది మే 9న జరిగిన అల్లర్ల కేసులో ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. అతని అరెస్టు తర్వాత పాకిస్తాన్లో అల్లర్లు చెలరేగాయి. అవినీతికి సంబంధించిన కేసులో హైకోర్టుకు హాజరైన సమయంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి