బంగ్లాదేశ్‌లోని హిందువులను రక్షించండి..భారత్‌కు సద్గురు విజ్జప్తి
- August 07, 2024
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిస్థితులపై ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బంగ్లాదేశ్‌లోని హిందువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు. హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు బంగ్లాదేశ్ అంతర్గత విషయం కాదని పేర్కొన్నారు.
మన పొరుగునున్న మైనార్టీల భద్రత కోసం సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. వారికి అండగా నిలువకుంటే భారత్ ఏనాటికి మహాభారత్ అవదని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు ఈ దేశంలో భాగమైన ప్రాంతం.. పొరుగు ప్రాంతంగా మారిందని గుర్తుచేశారు. ఈ దురాగతాల నుంచి మన జాతికి చెందిన వారిని రక్షించడం మన బాధ్యత అని జగ్గీ వాసుదేవ్ స్పష్టం చేశారు.
The atrocities being perpetrated against Hindus is not just an internal matter of #Bangladesh. Bharat cannot be Maha-Bharat if we do not stand up and act at the earliest to ensure the safety of minorities in our neighborhood. What was part of this Nation unfortunately became… pic.twitter.com/3pen0ucDay
— Sadhguru (@SadhguruJV) August 7, 2024
బంగ్లాదేశ్‌లోని హిందువుల నివాసాలు, వారి వ్యాపార సంస్థలపై దాడులు, లూటీలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు సంబంధించి సంస్కరణలు అమలు చేయాలని దేశవ్యాప్త ఆందోళనకు విద్యార్థులు పిలుపునిచ్చారు. దేశ ప్రజలు వారికి మద్దతు ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు, నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆ క్రమంలో వందల మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
దాంతో ప్రభుత్వం దిగి వచ్చి విద్యార్థులను చర్చలకు ఆహ్వానించింది. అవి కూడా విఫలమయ్యాయి. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. దాంతో దేశంలో శాంతి భద్రతలు మరింత క్షీణించాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అయినా బంగ్లాలో హిందువుల దేవాలయాలు, ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సద్గురు జగ్గీవాసుదేవ్ స్పందించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి