వంద మెడికల్ సీట్లతో సనత్‌నగర్ ఈఎస్‌ఐ వైద్య కళాశాల
- June 16, 2016
హైదరాబాద్: 2016-17 విద్యా సంవత్సరానికి వంద మెడికల్ సీట్లతో సనత్‌నగర్ ఈఎస్‌ఐ వైద్య కళాశాలను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. గురువారం హైదరాబాద్ హిల్‌పోర్టు రోడ్డులోని ఈఎస్‌ఐ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద మెడికల్ సీట్లలో 35 సీట్లను తెలంగాణ కార్మికుల పిల్లలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
జులై 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో ఉపాధి కల్పనా అంశంపై బ్రిక్ దేశాల ప్రతినిధులతో సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు.వచ్చే మూడేళ్లలో దేశంలో ఉద్యోగ, ఉపాధి కల్పనపైనే తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. నేషనల్ కెరీర్ పోర్టల్ ఆధ్వర్యంలో సీఐఐ సహకారంతో జులై మూడోవారంలో ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా వంద మోడల్ కెరీర్ సెంటర్లను నెలకొల్పుతామన్నారు. కూకట్‌పల్లిలో 5ఎకరాల స్థలంలో ఈఎస్‌ఐ ప్రాంతీయ కార్యాలయానికి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రమంత్రులు కేంద్రమందించే సాయంపై వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. హైదరాబాద్‌కు సంబంధించి ఐటీఐఆర్ ప్రాజెక్టు సమగ్ర నివేదికను రూపొందించి తనకు తెలియజేస్తే కేంద్రానికి విన్నవించి తగిన సహకారం అందిస్తామన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







