ప్రమాదాల నివారణకు.. ICBF ఆధ్వర్యంలో హీట్ స్ట్రెస్ అవేర్‌నెస్ సెషన్
- August 08, 2024
ఖతార్: ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున, వాటి కారణంగా తలెత్తే ప్రమాదాల నుండి రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇందు కోసం ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF ఖతార్) ఆగస్టు 2వ తేదీన ICBF కంజానీ హాల్‌లో హీట్ స్ట్రెస్ అవేర్‌నెస్ సెషన్‌ను నిర్వహించింది. వివిధ లేబర్ క్యాంపుల నుండి దాదాపు 150 మంది కార్మికులు, ఇతర కమ్యూనిటీ సభ్యులు సెషన్‌కు హాజరయ్యారు. సెషన్ ప్రొసీడింగ్‌లను ICBF జనరల్ సెక్రటరీ వర్కీ బోబన్ సమన్వయం చేసారు. ICBF ప్రెసిడెంట్ షానవాస్ బావ.. ఈ వేసవి కాలంలో అవగాహన కార్యక్రమ ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ఇండియన్ ఎంబసీ లేబర్ డిపార్ట్‌మెంట్ నుండి ASO, జయ గణేష్ భరద్వాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్మానా గ్రూప్ ఇన్సులేషన్ ఇంజినీరింగ్ కంపెనీలో SHEQ మేనేజర్ సుశాంత్ సావర్‌డేకర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిబిఎఫ్ సెక్రటరీ టికె ముహమ్మద్ కున్హి, ICBF మేనేజింగ్ కమిటీ సభ్యుడు నీలాంబరి సుశాంత్, T రామసెల్వం, ఐసిసి సెక్రటరీ అబ్రహం జోసెఫ్, ఐఎస్‌సి మేనేజింగ్ కమిటీ మెంబర్ దీపక్ చుక్కలతో పాటు ఇతర సంఘం నాయకులు మరియు అసోసియేటెడ్ ఆర్గనైజేషన్ సభ్యులు హాజరయ్యారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







