ఆ హీరోయిన్‌తో ఎంగేజ్‌మెంట్.! షాకిచ్చిన నాగ చైతన్య.!

- August 08, 2024 , by Maagulf
ఆ హీరోయిన్‌తో ఎంగేజ్‌మెంట్.! షాకిచ్చిన నాగ చైతన్య.!

తెలుగమ్మాయ్ శోభిత దూళిపాళతో అక్కినేని బుల్లోడు నాగ చైతన్య రిలేషన్‌షిప్‌లో వున్నాడంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వినిపించాయ్. తూచ్.! అలాంటిదేం లేదంటూ ఇద్దరూ ఖండించేశారు.

కట్ చేస్తే, ఈ ఇద్దరూ సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు ఈ రోజు అనగా గురువారం ఉదయం 9.42 గంటలకు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో స్వయంగా అక్కినేని నాగార్జునే ధృవీకరించారు.

వారి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు కూడా షేర్ చేశారు. చైతూ, శోభిత జీవితాంతం ఆనందంగా వుండాలని ఆశీర్వదిస్తున్నా.. అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

సమంతతో విడాకుల తర్వాత వెంటనే ఈ వార్త నెట్టింట్లో హల్ చల్ చేసింది. అసలు సమంత విడాకులకు కారణం కూడా ఇదే.. అంటూ ప్రచారం జరిగింది అప్పట్లో.

కానీ, ఆ ప్రచారమే నిజమైందిప్పుడు. సడెన్‌గా వీరిద్దరూ ఒక్కటయ్యారు. శోభితను అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానించడాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నాం.. అంటూ నాగార్జున చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com