బిగ్‌బాస్ కంటెస్టెంట్లు వీళ్లేనట.!

- August 08, 2024 , by Maagulf
బిగ్‌బాస్ కంటెస్టెంట్లు వీళ్లేనట.!

బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్‌బాస్ గేమ్ షోకి ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత తిట్టుకున్నా ఈ షోని అభిమానించే ఆడియన్స్ వుంటూనే వుంటారు. ప్రతీ ఏడాదీ బిగ్‌బాస్ సీజన్ స్టార్ట్ అవుతుందంటే ఆ క్రేజే వేరు.

ఈ ఏడాది కూడా భారీ అంచనాలతో బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ స్టార్ట్ కాబోతోంది. ఎప్పుడు.? ఏంటీ.? అనే డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ, బజ్ అయితే స్టార్ట్ అయ్యింది.

ఆల్రెడీ లోగో రిలీజ్ చేశారు. అంతులేని వినోదం.. అంటూ ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. కమెడియన్ సత్య, నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన ఈ టీజర్‌కి రెస్పాన్స్ కూడా బాగుంది.

ఇక, ఈ సీజన్ కంటెస్టెంట్లు వీళ్లే.. అంటూ కొంతమంది పేర్లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయ్. వాళ్లలో ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి, రీసెంట్‌గా వైరల్ అయిన కుమారి ఆంటీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయ్.

నటి సన, బుల్లితెర నటుడు ఇంద్రనీల్, సీనియర్ హీరో అబ్బాస్, న్యూస్ రీడర్ కళ్యాణి, యూ ట్యూబర్ బంచిక్ బబ్లూ తదితర పేర్లు వినిపిస్తున్నాయ్. చూడాలి మరి వీరిలో ఎంతమంది పేర్లు ఫైనల్ కానున్నాయో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com