బిజినెస్ బే హత్య కేసు..యువకుడికి జీవిత ఖైదు..5 మంది విడుదల
- August 09, 2024
దుబాయ్: బిజినెస్ బే హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు పడగా,మరో 5 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. మే 2023లో బిజినెస్ బే ఏరియాలో జరిగిన హత్యలో తమ 19 ఏళ్ల స్వదేశీయుడికి సహాయం చేయడం మరియు ప్రోత్సహించడం వంటి నేరారోపణలను తోసిపుచ్చిన దుబాయ్ అప్పీల్ కోర్ట్.. ఐదుగురు ఇజ్రాయెలీలను నిర్దోషులుగా ప్రకటించింది. షిషా కేఫ్ వెలుపల 33 ఏళ్ల ఇజ్రాయెల్ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
జనవరిలో దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ 33 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన
కేసులో యువకుడిని దోషిగా నిర్ధారించింది. అతనికి జీవిత ఖైదు విధించారు. మరోవైపు మరో ఐదుగురు నిందితులకు ఒక్కొక్కరికి పదేళ్ల చొప్పున జైలుశిక్ష పడింది. శిక్షలు అనుభవించిన తర్వాత ఆ ఆరుగురిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.హత్య జరిగిన 24 గంటల లోపే దుబాయ్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







