మృణాల్ సంగతి అంతేనా.!

- August 09, 2024 , by Maagulf
మృణాల్ సంగతి అంతేనా.!

మృణాల్ ఠాకూర్.. బాలీవుడ్‌లో ఎప్పుడో నటిగా పాతుకుపోయింది. కానీ, బ్రేక్ రాలేదంతే. ‘సీతారామం’ సినిమా పుణ్యమా అని స్టార్‌డమ్ దక్కించుకుంది అటు నార్త్‌లో అయినా. ఇటు సౌత్‌లో అయినా.
‘సీతారామం’తో వచ్చిన క్రేజ్‌కి తర్వాత మృణాల్ నటించిన సినిమాల్లో ‘హాయ్ నాన్న’ సూపర్ హిట్ అయ్యింది. ‘ఫ్యామిలీ స్టార్’ మళ్లీ బోల్తా కొట్టింది. రీసెంట్‌గా ‘కల్కి’లో గెస్ట్ రోల్ పోషించింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేతిలో తెలుగులో పెద్దగా సినిమాలేం లేవు. కేవలం క్రేజ్ తప్ప.
బాలీవుడ్‌లో ‘సన్ ఆఫ్ సర్దార్ 2’లో నటిస్తోంది. అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. స్టార్‌డమ్ దక్కినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు మృణాల్ ఠాకూర్‌కి.
అయితే, క్రేజ్ వుంది కదా.. అని ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా.. మంచి కథలను ఎంచుకుంటోంది. ఆచి తూచి వ్యవహరిస్తోందట మృణాల్ ఠాకూర్. అందుకే చేతి నిండా సినిమాల్లేవని అంటోంది.
మంచి కథ దొరికితే, ఒక్క సినిమా అయినా చాలు స్టార్ మారిపోవడానికి అని ధీమాగా చెబుతోందీ బ్యూటీ. కానీ, మృణాల్ పనైపోయినట్లేనేమో.. అని కొందరు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com