కొత్త ప్రాజెక్టులు షురూ చేసిన అక్కినేని అందగాడు అఖిల్.!
- August 09, 2024
ఎంత ప్రయత్నించినా అక్కినేని వారసుడు అఖిల్‌కి విజయం అనేదే దరి చేరడం లేదు. నాలుగు సినిమాల్లో నటించాడు. నాలుగూ భారీ అంచనాలతో భారీ బడ్జెట్‌తో రూపొందినవే. వాటిలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సో సో అనిపించుకుందంతే.
దాంతో, ఇక అఖిల్ సినిమాలకు నో చెప్పేస్తే బెటర్ అని ఓ వర్గం పెదవి విరిచేసింది. కానీ, సింపుల్ లవ్ అండ్ రొమాంటిక్ చిన్న బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ పోతే అఖిల్‌కి ఎక్కడో చోట హిట్టు పడే అవకాశాలుంటాయని మరో వర్గం ఎంకరేజ్ చేసింది.
ఫెయిల్యూర్ వచ్చినప్పుడయినా ఒళ్లు దగ్గరపెట్టుకుని లో బడ్జెట్ సినిమాలు సింపుల్ స్టోరీస్‌ని ఎంచుకోవాలని ఇంకొందరు సినీ మేథావులు సలహాలిచ్చారు. కానీ, అఖిల్ మాత్రం పెద్ద బడ్జెట్ సినిమాలకే ట్రెండ్ వేస్తూ వచ్చాడింతవరకూ.
దాంతో గ్యాప్ వచ్చేసింది. అయితే ఇప్పుడు అఖిల్ జోరు పెంచినట్లు తెలుస్తోంది. ఒకటి కాదు రెండు సినిమాలు ఓకే చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి సొంత బ్యానర్‌లో రూపొందబోందట. మురళీ కృష్ణ అబ్బూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారట.
నాగచైతన్య, నాగార్జున కలిసి మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌లో ఈ సినిమాని నిర్మించబోతున్నారట. ‘లెనిన్’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అలాగే మరో సినిమా కోసం కొత్త దర్శకుడు అనిల్ నెరేట్ చేసిన స్టోరీని ఓకే చేశారట. ఈ సినిమాని పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారట. ‘ధీర’ అనే టైటిల్ ఈ సినిమాకి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయ్.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్‌లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..