వీధికుక్కల దాడులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించిన హరీశ్ రావు
- August 10, 2024
హైదరాబాద్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నిన్న నాలుగు రోజుల పసికందును కుక్కలు పీక్కుతిన్న ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగాయని, ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నిన్న వరంగల్‌లో, అంతకుముందు నార్సింగిలో దివ్యాంగ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయని గుర్తు చేశారు. ఇబ్రహీంపట్నంలో నాలుగేళ్ల చిన్నారి చనిపోయిందని వాపోయారు.
8 నెలల కాలంలో 343 కుక్కగాటు ఘటనలు జరిగాయన్నారు. వీధి కుక్కల దాడులపై పలుమార్లు హైకోర్టు హెచ్చరించినా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందుతుంటే… ఇలాంటి హృదయవిధారక ఘటనలపై ప్రభుత్వం చలించకపోవడం అమానవీయం అన్నారు. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడమనేది సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. కుక్క కాటు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
గ్రామాల్లో, పట్టణాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిలిపివేయడంతో పారిశుధ్య నిర్వహణ పడకేసిందన్నారు. చెత్తాచెదారం పేరుకుపోయిన ప్రాంతాల్లో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైందన్నారు. మున్సిపలిటీల్లో పురపాలక శాఖ వైఫల్యం వల్ల వీధి కుక్కల నియంత్రణ లేకుండా పోయిందన్నారు. అదే సమయంలో సరైన నిధుల కేటాయింపు లేక కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసే వ్యవస్థ కూడా అసలు సరిగా పనిచేయడం లేదని విమర్శించారు. దీంతో వీధి కుక్కల సంతానం విపరీతంగా పెరిగి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







