గల్ఫ్ దేశాలకు వారికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..ఇక స్పెషల్ ట్రైనింగ్ !

- August 10, 2024 , by Maagulf
గల్ఫ్ దేశాలకు వారికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..ఇక స్పెషల్ ట్రైనింగ్ !

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ అనుబంధ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకాం) సంస్థ హైదరాబాద్ లోని మసాబ్ ట్యాంక్ మల్లేపల్లి ఐటిఐ ఆవరణలో గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లేవారికి ఒకరోజు ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (పిడిఓటి) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రవాసీ సంఘాల ప్రతినిధుల బృందం మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, మాజీ ఇండియన్ అంబాసిడర్ డా.బిఎం వినోద్ కుమార్ నాయకత్వంలో వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి, కువైట్ ఎన్నారై కళ్యాణి చెప్పల, అబుదాబి ఎన్నారై ప్రియా సింగిరెడ్డిలు టాంకాం ను సందర్శించారు. టాంకాం జనరల్ మేనేజర్ కే.నాగభారతి, మేనేజర్ ఎస్ శబ్న, ఐటిఐ ట్రైనింగ్ ఆఫీసర్ ఎంబి క్రిష్ణ యాదవ్ లు టాంకాం కార్యకలాపాలు, శిక్షణ గురించి ప్రతినిధి బృందానికి వివరించారు. 

ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన పథకంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నైపుణ్య అభివృద్ధి పారిశ్రామిక మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో దేశంవ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నారు. సురక్షితమైన, చట్టబద్ధమైన వలసలకు మార్గాల గురించి విషయ పరిజ్ఞానం, అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఆయా దేశాల సాంస్కృతి, భాష, ఆచార వ్యవహారాలు, స్థానిక నియమాలు, నిబంధనలు తెలియజేస్తూ వలస వెళ్లే కార్మికుల విశిష్ట నైపుణ్యాలు (సాఫ్ట్ స్కిల్స్) పెంపొందించుట ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం అని ట్రైలర్ బిఎల్ సురేంద్రనాథ్ తెలిపారు. రిక్రూట్మెంట్ నుండి గల్ఫ్ లో ఉద్యోగంలో చేరేంతవరకు వివిధ దశల్లో ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై ఈ శిక్షణలో తెలుపుతున్నారు. గల్ఫ్ దేశాలలో చట్టాలు, వాటిని అతిక్రమిస్తే వారు వేసే శిక్షలను తెలుపుతున్నారు. ఇంతేకాకుండా ఏ రంగంలో ఏ పని చేస్తే ఎంత జీతం వస్తుంది, దానిని ఎలా ఖర్చు పెట్టుకోవాలి, పొదుపు చేసిన డబ్బును కుటుంబసభ్యులకు ఎలా చేరవేయాలి ఇంకా తదితర విషయాలను వివరిస్తున్నారు.

--సాయి కృష్ణ(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్ )

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com