ఒమన్‌లో OMR1.4 బిలియన్ల రియల్ ఎస్టేట్ లావాదేవీలు

- August 13, 2024 , by Maagulf
ఒమన్‌లో OMR1.4 బిలియన్ల రియల్ ఎస్టేట్ లావాదేవీలు

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీల విలువ 0.5% పెరిగి 2024 జూన్ చివరి నాటికి OMR1,409.6 మిలియన్లకు చేరుకుంది.  2023లో ఇవి OMR1,402.5 మిలియన్లుగా ఉంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) తాజా నివేదిక వెల్లడించింది. జూన్ 2024 చివరి వరకు చట్టపరమైన లావాదేవీల కోసం వసూలు చేసిన రుసుము OMR32.3 మిలియన్లు. 2023 లో ఇదే కాలంతో పోలిస్తే 3.5% క్షీణత నమోదయ్యింది.  

జూన్ 2024 చివరి వరకు విక్రయ ఒప్పందాల విలువ OMR545.6 మిలియన్‌లకు చేరుకున్నాయి. 2023 అదే కాలంలో 32,907తో పోలిస్తే విక్రయ ఒప్పందాల సంఖ్య 0.9% తగ్గి 32,596కి చేరుకుంది. 2023 అదే కాలంలో OMR852.1 మిలియన్లతో పోలిస్తే జూన్ 2024 చివరి వరకు తనఖా ఒప్పందాల ట్రేడెడ్ విలువ 0.5% పెరిగి OMR856.7 మిలియన్లకు చేరుకుంది. అదే సమయంలో తనఖా ఒప్పందాల సంఖ్య 12,062 నుండి 16.9% తగ్గి 10,028కి చేరుకుంది. ఇక జూన్ 2024 చివరి నాటికి జారీ చేయబడిన టైటిల్ డీడ్‌ల సంఖ్య 7% తగ్గి 109,666కి చేరుకుంది. అయితే GCC పౌరుల కోసం జారీ చేయబడిన టైటిల్ డీడ్‌ల సంఖ్య జూన్ 2023 చివరి వరకు 633తో పోలిస్తే 5.2% పెరిగి 666కి చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com