వెంకీ - అనిల్ రావిపూడి మొదలెట్టేశారు
- August 14, 2024
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన ప్రాంచైజీ సినిమాలు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ మంచి విజయం అందుకున్నాయ్. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో ఇంకో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఆల్రెడీ ఎప్పుడో ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. కానీ, వెంకటేష్ లేకుండానే కొన్ని కీలక ఘట్టాలు తెరకెక్కించారు. లేటెస్ట్‌గా ఈ సినిమా సెట్స్‌లోకి వెంకటేష్ ఎంట్రీ ఇచ్చారు.
ఇంతవరకూ వెంకటేష్ ‘రానా నాయుడు 2’ వెబ్ సిరీస్‌తో బిజీగా వుండడం వల్ల ఈ షూటింగ్‌కి అటెండ్ కాలేకపోయాడు. వెంకీ లేని సీన్లను ఫస్ట్ షెడ్యూల్‌లో పూరి చేసేశాడు అనిల్ రావిపూడి.
ఇక రెండో షెడ్యూల్‌లో వెంకటేష్‌పై కీలక సన్నివేశాలు పూర్తి చేయనున్నాడు. ఈ కాంబినేషన్‌లో బాగా అచ్చొచ్చిన సంక్రాంతి టార్గెట్‌గా ఈ సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాడు అనిల్ రావిపూడి.
‘ఎక్స్ గర్ల్‌ప్రెండ్ ఎక్స్‌లెంట్ వైఫ్’ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాని క్రైమ్ థ్రిల్లర్‌గా వెంకీ అండ్ అనిల్ రావిపూడి స్టైల్ ఎంటర్‌టైన్‌మెంట్ టోన్‌లో తెరకెక్కించబోతున్నారు.
మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో వెంకటేష్‌కి జోడీగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







