బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్.!

- August 14, 2024 , by Maagulf
బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్.!

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వరుసగా సౌత్‌లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సౌత్ సినిమాలు హిట్ లిస్టులో చేరుతున్న సంగతీ తెలిసిందే.

అలా ఆయన నటించిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌కి చాలా చాలా ప్రెస్టీజియస్. సంజయ్ దత్ లక్కు పూరీ జగన్నాధ్‌కి కలిసొస్తుందో లేదో తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాలి.

ఇండిపెండెన్స్‌డే కానుకగా ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.  రామ్ పోతినేని హీరోగా కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సంజయ్ దత్ మీడియాతో చేసిన చిట్‌చాట్ ఆకర్షణగా నిలిచింది. ఈ చిట్‌చాట్‌లో బాలీవుడ్ సినిమాల్ని వుద్దేశించి సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయ్.

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో మాస్, యాక్షన్ మిళితమై వుండేది. అందుకే అప్పట్లో సినిమాలు సూపర్ హిట్స్ అయ్యేవి. కానీ ఇప్పుడు అక్కడ అది మిస్ అవుతోంది. అది సౌత్ సినిమాల్లో కనిపిస్తోంది. అందుకే సౌత్ సినిమాలు దేశం గర్వించదగ్గ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతున్నాయ్.

బాలీవుడ్‌కీ తిరిగి అలాంటి వైభవం రావాలని కోరుకుంటున్నా.! ‘డబుల్ ఇస్మార్ట్’లో నా పాత్ర చాలా శక్తివంతంగా డిజైన్ చేశారు డైరెక్టర్ పూరీ..’ అని సంజయ్‌దత్ వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com