‘ఆయ్’ ఎందుకంత స్పెషల్ అంటే.!
- August 14, 2024
ఈ ఇండిపెండెన్స్ డేకి రెండు పెద్ద సినిమాలతో పాటూ, రిలీజవుతున్న చిన్న సినిమాల్లో ‘ఆయ్’ ఒకటి. చిన్న సినిమానే అయినా ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నిఖిల్, శ్రీలీల వంటి స్టార్స్ హాజరయ్యి సినిమాకి సపోర్ట్ అందించారు.
అలాగే, పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీయార్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమాని సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేస్తున్నారు.
అసలు ‘ఆయ్’ సినిమాకి ఎందుకంత సీనూ సినిమా అనుకుంటున్నారా..? ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్న కుర్రోడు నార్నె నితిన్. ఈయన ఎవరో కాదు, స్వయానా జూనియర్ ఎన్టీయార్ బావమరిది.
నార్నె శ్రీనివాస్ రావు తనయుడు. జూనియర్ ఎన్టీయార్ సతీమణి లక్ష్మీ ప్రసన్నకు సోదరుడు కావడం విశేషం. అందుకే ఈ సినిమాని ఓ రేంజ్‌లో ప్రమోట్ చేస్తున్నారు.
అయితే, బ్యాక్ గ్రౌండ్ ఎలా వున్నా సినిమాలో కంటెంట్ వుంటే ఖచ్చితంగా హిట్ అవుతున్న రోజులివి. ప్రచార చిత్రాలు చూస్తుంటే ఫర్వలేదనిపిస్తుంది. సెన్సార్ టాక్ నుంచి ఫీల్ గుడ్ మూవీ అనే రెస్పాన్స్ వచ్చింది. సో, ‘ఆయ్’కి ప్రేక్షకులిచ్చే రిజల్ట్ ఎలా వుండబోతోందో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే..
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







