పేగులు ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి.?

- August 14, 2024 , by Maagulf
పేగులు ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి.?

పేగులు శుభ్రంగా వుంటేనే శరీరమంతా ఆరోగ్యంగా వుంటుంది. అందుకే పేగుల ఆరోగ్యంగా వుంచుకోవడం చాలా అవసరం. పేగులు శుభ్రంగా వుండడమంటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా వుండడమే.

జీర్ణ వ్యవస్థ సక్రమంగా వుండాలంటే ఫైబర్ ఎక్కువగా వున్న ఆహారం తీసుకోవాలి. అలాగే, పండ్లు, కూరగాయలు పేగుల్లోని టాక్సిన్లను బయటికి పంపించేందుకు తో్డ్పడతాయ్.

అందుకే ఆకుకూరలు రెగ్యులర్‌గా డైట్‌లో వుండేలా చూసుకోవాలి. తగిన మోతాడులో నీరు తాగడం వల్ల కూడా టాక్సీన్లు బయటికి పోతాయ్. తద్వారా పేగు గోడలకు అంటుకుని వున్న చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది.

అలాగే, అవకాడో, యాపిల్, బెర్రీస్ వంటి పండ్లకు ప్రేగుల్లోని టాక్సిన్లను బయటికి పంపించే శక్తి ఎక్కువ. అందుకే కనీసం సీజనల్‌గా అయినా ఆయా పండ్లను తీసుకోవాలి.

ప్రేగులు శుభ్రంగా వుంచేందుకు హెర్బల్ టీలు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. హెర్బల్ టీ అలవాటున్న వారి జీర్ణ వ్యవస్థ సమర్ధవంతంగా పని చేస్తుంది. అలాగే, మానసికంగా ధృడంగా వుండే శక్తిని కూడా కలిగి వుంటారు హెర్బల్ టీ తాగేవారు.

గోరు వెచ్చని నీటిలో కలిపిన చియా సీడ్స్ తీసుకోవడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా వుంటుంది. వీటిలో పుష్కలంగా వుండే కాల్షియం పేగుల్లోని డిటాక్సినేషన్‌కి తోడ్పడుతుంది.

పులియబెట్టిన ఆహార పదార్ధాలను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. తద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. ముఖ్యంగా పులియబెట్టిన పెరుగు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com