రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- August 15, 2024
న్యూ ఢిల్లీ: రైలు ప్రయాణికులకు శుభవార్త..ఇక పై రైల్వే టికెట్ కౌంటర్ దగ్గర నగదు లావాదేవీల కోసం వేచి చూడాల్సిన పనిలేదు.దక్షిణ మధ్య రైల్వే ఇకపై అన్ని రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. క్యాష్ పేమెంట్లకు బదులుగా డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహిస్తుంది. నగదు రహిత లావాదేవీల కోసం జనరల్ బుకింగ్ అండ్ రిజర్వేషన్ కౌంటర్లలో డిజిటల్ పేమెంట్లను పెంచనుంది.
ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే టిక్కెట్ల కొనుగోలు కోసం క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా టిక్కెట్ ఛార్జీని క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించవచ్చు. టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులు ఇకపై, నగదుకు సరిపడే చిల్లరను తీసుకొని వెళ్ళే అవసరం లేదు. ఆన్‌లైన్ పేమెంట్ చేయడం ద్వారా రైల్వే స్టేషన్ కౌంటర్ దగ్గరే తక్షణమే టికెట్ పొందడానికి అవకాశం కలుగుతుంది.
రైల్వే జోన్లలోని అన్ని స్టేషన్ల టికెటింగ్ కౌంటర్లలో టిక్కెట్ విండో వెలుపల ప్రత్యేక డివైజ్‌లను ఏర్పాటు చేయనుంది. టికెట్ జారీ చేయడానికి సంబంధించిన అన్ని వివరాలను సిస్టమ్‌లో రిజిస్టర్ చేసిన తర్వాత చెల్లింపును అంగీకరించే ముందు ఈ డివైజ్‌లలో క్యూఆర్ కోడ్ డిస్‌ప్లే అవుతుంది. తద్వారా మొబైల్ ఫోన్లలో ఉన్న యూపీఐ పేమెంట్ యాప్ ద్వారా ప్రయాణీకుడు దానిని స్కాన్ చేయవచ్చు. చెల్లించవలసిన చార్జీ క్రెడిట్ అయిన తరువాత టికెట్ జనరేట్ అవుతుంది. దాంతో ప్రయాణీకుడు జారీ అయిన టికెట్‌తో రైల్లో ప్రయాణించవచ్చు.
తొలి దశలో భాగంగా రైల్వే ప్రయాణికుల కోసం ఈ నగదు రహిత లావాదేవీల సౌలభ్యాన్ని ముందుగా ముఖ్యమైన స్టేషన్లలోని ప్రధాన కౌంటర్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ సదుపాయాన్ని ఇప్పుడు రైల్వే జోన్లోని అన్ని కౌంటర్లకు విస్తరించనున్నారు. కౌంటర్లలో ఏర్పాటుకు అవసరమైన డివైజ్‌లు, అన్ని స్టేషన్లకు సరఫరా చేస్తోంది.
ఇప్పటికే చాలా స్టేషన్లలో అమల్లోకి వచ్చాయి. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో క్యూఆర్ కోడ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. రైలు వినియోగదారులందరూ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్‌లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'