చెన్నై విమానాశ్రయం లో భారీ బంగారం పట్టివేత

- July 04, 2015 , by Maagulf
చెన్నై విమానాశ్రయం లో భారీ బంగారం పట్టివేత

చెన్నై విమానాశ్రయం లో ఓ ప్రయాణికుడు విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన మూడు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం దోహా నుంచి చెన్నై వచ్చిన సిరాజ్ అనే ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అతడి వద్ద మూడు కేజీల బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 3 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com