వెడ్డింగ్ ఈవెంట్ కంపెనీపై దావా వేసిన నూతనవధువు..!
- August 18, 2024
బహ్రెయిన్: వివాహ ప్రణాళిక సంస్థపై ఓ నూతన వధువు కోర్టుకెక్కింది. ఈవెంట్ కంపెనీ తన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని తన దావాలో పేర్కొంది. పెళ్లి రోజును మరియు గణనీయమైన ఆర్థిక నష్టాలను మిగిల్చిందని, ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కోర్టుకు తెలిపింది. తనకు జరిగిన నష్టానికి ఈవెంట్ యజమాని నుంచి పరిహారం ఇప్పించాలని వధువు తరఫు న్యాయవాది కోరారు.
ఒక హోటల్లో తన వివాహాన్ని ఏర్పాటు చేయడానికి వధువు కంపెనీతో ఒప్పందంపై సంతకం చేసిందని, మొత్తం 8,000 దినార్లతోపాటు అదనపు భోజనం సదుపాయం కోసం అదనంగా 920 దినార్లు చెల్లించినట్టు దావాలో పేర్కొన్నారు.అయితే, కంపెనీ తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైందని, ముందుగా అనుకున్న పెళ్లి మండపాన్ని బుక్ చేయలేదని, కాంట్రాక్ట్ నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేసిందని వధువు దావాలో వెల్లడించింది.
కేసును విచారించిన కోర్టు..వధువుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఒప్పందాన్ని రద్దు చేసి, క్లెయిమ్ చేసిన తేదీ నుండి పూర్తిగా తిరిగి చెల్లించే వరకు 3% వార్షిక వడ్డీతో పాటు వధువుకు పూర్తి మొత్తం 10,920 దినార్లను తిరిగి చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. వధువు లీగల్ ఫీజులు మరియు ఖర్చులను భరించాలని కోర్టు కంపెనీని ఆదేశించింది.
తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







