సౌదీ అరేబియాలో మంకీపాక్స్ నమోదు కాలేదు..!
- August 18, 2024
రియాద్: ఇటీవలి ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి కారణమైన మంకీపాక్స్ (mpox) క్లాడ్ 1 కేసులేవీ రాజ్యంలో నమోదుకలేదని పబ్లిక్ హెల్త్ అథారిటీ (వెఖాయా) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుదల ఉన్నప్పటికీ, సౌదీ అరేబియాలో ఆ ప్రభావం లేదని తెలిపింది. వివిధ ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కోవడానికి కింగ్డమ్ ఆరోగ్య రంగం బలంగా ఉందని వెకాయా స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి, జనాభా ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాజ్యం సమగ్ర నివారణ చర్యలను అమలు చేస్తోందన్నారు. అధికారిక సమాచారాంపై ఆధారపడాలని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం లేదా పుకార్లను నమ్మొద్దని వెకాయా ప్రజలను కోరింది. ప్రజలు ఆరోగ్యకరమైన అలవాట్లను కలిగివుండాలని, mpox వ్యాప్తిని నివేదించిన దేశాలకు ప్రయాణించకుండా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!







