వైరల్ ఫీవర్ నుంచి ఉపశమనం పొందాలంటే.!
- August 18, 2024
సీజన్ మారే టైమ్‌లో వైరల్ ఫీవర్ వేధిస్తుంటుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పితో కూడిన జ్వరం చాలా ఇబ్బంది కలిగిస్తుంటుంది వైరల్ ఫీవర్ లక్షణాల్లో.
వైద్యులు సూచించిన మందులతో పాటూ, కొన్ని నేచురల్ రెమిడీస్ కూడా పాటిస్తే తొందరగా వైరల్ ఫీవర్ నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
వైరల్ ఫీవర్‌లో గొంతు నొప్పి ప్రధమంగా వేధిస్తుంటుంది. వికారం, వాంతులు కూడా వుంటాయ్ కొందరిలో. అలాంటి వారికి అల్లం మేలు చేస్తుంది.
కాల్చిన అల్లం ముక్కను సాల్ట్‌తో మిక్స్ చేసి తింటే ఉపశమనం వుంటుంది. లేదా అల్లం కలిపిన టీ తాగినా ఫలితం వుంటుంది.
వెల్లుల్లిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వైరల్ జ్వరాన్ని తొందరగా తగ్గించడంలో తోడ్పడతాయ్. అలాగే, నాలుకకు రుచినిచ్చేందుకు కూడా సహాయపడుతుంది వెల్లుల్లి.
కివీ ఫ్రూట్స్ తినడం వల్ల వైరల్ ఫీవర్ వల్ల వచ్చే నీరసం తగ్గుతుంది. అలాగే బ్రొకోలీలోని సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా మేలు చేస్తాయ్. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయ్.
అన్నింటికీ మించి వేడి నీటి ఆవిరి పట్టడం చాలా మేలు చేస్తుంది. మరిగించిన నీటిలో కాస్త రాక్ సాల్ట్, పసుపు వేసి ఆవిరి పడితే మంచి పలితం వుంటుంది.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్లో బ్యాంకులకు సెలవులే సెలవులు







