తప్పనిసరి బీమాతో HMCలో సందర్శకులకు అత్యవసర వైద్యం..ఖతార్‌

- August 19, 2024 , by Maagulf
తప్పనిసరి బీమాతో HMCలో సందర్శకులకు అత్యవసర వైద్యం..ఖతార్‌

దోహా: ఇటీవల ఖతార్‌కు సందర్శకుల సంఖ్య పెరగడంతో హమద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి) వారికి అత్యవసర వైద్య చికిత్స మరియు సహాయంపై కీలక ప్రకటన విడుదల చేసింది. అత్యవసర వైద్య చికిత్స మరియు సహాయం అవసరమైతే సందర్శకులు ఖతార్‌లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. సందర్శకులు తప్పనిసరి బీమాతో HMCలో అత్యవసర వైద్య చికిత్సను పొందవచ్చుని, సందర్శకులందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ లభిస్తుందని తెలిపింది. ఖతార్ 2023లో తప్పనిసరి సందర్శకుల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. అత్యవసర వైద్య చికిత్స కోసం సందర్శకులకు QR150,000 వరకు వర్తిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com