వీకెండ్‌ వెదర్‌: యూఏఈలో హాట్‌ హాట్‌గా

- June 17, 2016 , by Maagulf
వీకెండ్‌ వెదర్‌: యూఏఈలో హాట్‌ హాట్‌గా

వేసవి తాపం యూఏఈ వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వీకెండ్‌లోనూ అధిక ఉష్ణోగ్రతలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని అంచనా వేశారు. తీర ప్రాంతాల్లో హ్యుమిడిటీ చాలా ఎక్కువగా ఉంటుందనీ, ఉక్కపోతతో ఇబ్బందులు తప్పకపోవచ్చని వారు వివరించారు. యూఏఈ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మెటియరాలజీ అండ్‌ సెస్మాలజీ (ఎన్‌సిఎంఎస్‌), అక్కడక్కడా క్లౌడీ వెదర్‌ కనిపించవచ్చని చెప్పారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. సముద్ర తీర ప్రాంతం ప్రశాంతంగానే ఉంటుందని, అరేబియన్‌ గల్ఫ్‌ అలాగే ఒమన్‌ సీ కూడా ప్రశాంతంగానే ఉంటుందని సందర్శకులకు సమాచారమిస్తోంది వాతావరన శాఖ. శనివారం ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com