ఖలాలీలో బాలికల కొత్త పాఠశాల.. 1,320 మంది విద్యార్థులకు ప్రయోజనం..!
- August 22, 2024
కువైట్: కువైట్ ఫండ్ ఫర్ అరబ్ ఎకనామిక్ డెవలప్మెంట్ (KFAED) ద్వారా ఖలాలీలో బాలికల కోసం ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాల నిర్మాణం చేపట్టనున్నది. దీనిని విద్యా మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. పెరుగుతున్న విద్యార్థుల జనాభాకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అని MP ఖలీద్ బునాక్ తెలిపారు. దీని కోసం ఖలాలీలో ప్రభుత్వం 12,007 చదరపు మీటర్ల ప్లాట్‌ను కేటాయించింది. పాఠశాలలో రెండు విద్యా భవనాలు ఉంటాయి. ఒక్కొక్కటి నాలుగు అంతస్తులు. ఒక్కో భవనంలో 22 తరగతి గదులు ఉంటాయి. ఈ పాఠశాలలో దాదాపు 1,320 మంది విద్యార్థులు ఉంటారు. ఒక్కో తరగతికి 30 మంది విద్యార్థులు ఉంటారు. సైన్స్ ల్యాబ్‌లు, ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ల్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజైన్ మరియు టెక్నాలజీ ల్యాబ్‌లు, ఆర్ట్ రూమ్ మరియు టీచర్ల రూమ్‌లు ఉంటాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







