మొక్కజొన్న పాయసం

- June 17, 2016 , by Maagulf
మొక్కజొన్న పాయసం

కావలసిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు - అరకప్పు పనీర్‌ (చిన్నముక్కలు) - అరకప్పు పాలు - అరలీటరు, పాలపొడి - 6 టేబుల్‌ స్పూన్లు, పిస్తా

పలుకులు-8, బాదం పలుకులు -10, రోజ్‌వాటర్‌ - టీ స్పూను, యాలకుల పొడి - అరస్పూను, పంచదార - టేబుల్‌స్పూను, కుంకుమపువ్వు - కొద్దిగా.
తయారుచేసే విధానం
ముందుగా కుంకుమపూవుని రోజ్‌వాటర్‌లో, పిస్తా, బాదం పప్పుల్ని వేడి నీటిలో కొద్దిసేపు నానబెట్టి ఉంచాలి. పిస్తా బాదంలను నీటిలోంచి తీసి సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఒక పాత్రలో పాలను కాగబెట్టి, అందులో మొక్కజొన్న గింజల్ని, పనీరు ముక్కల్ని వేసి, చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉడికించి ఆపై పాలపొడిని వేస్తూ ఉండలు చుట్టకుండా కలపాలి. పాలు చిక్కబడ్డాక పంచదారను వేసి, అది కరుగుతున్నపడు కుంకుమపూవును కూడా వేసి దించాలి. తరిగి ఉంచుకున్న బాదం, పిస్తా ముక్కల్ని, యాలకుల పొడిని పైన చల్లాలి. పాయసం గది ఉష్ణోగ్రతలోకి వచ్చేక ఫ్రిజ్‌లో ఉంచి చల్లచల్లగా తాగితే చాలా రుచిగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com