చర్మాన్ని మెరిపించాలనుకుంటున్నారా.. కీరదోస ఐసు వాడి చూడండి!
- June 17, 2016
చర్మంపై ఎండ ప్రభావం పడటం వల్ల ఈ కాలంలో ముఖం, కళ్లూ జీవం కోల్పోతాయి. కళ్ల వాపు, కంటి చుట్టూ నల్లని వలయాలూ, ముఖంలో తాజాదనం లేకపోవడం వంటి సమస్యలూ ఎదురవుతాయి. ఇలాంటి వాటన్నింటినీ తగ్గించుకోవాలంటే.. ఏం చేయాలో చూడండి..
*
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లే కాదు, కెఫీన్ కూడా ఉంటుంది. సాధారణంగా కళ్లు అలసినప్పుడు ఆ టీ బ్యాగుల్ని కళ్లపై పెట్టుకోవడం తెలిసిందే. అయితే వాటి కన్నా, దాన్ని ఐసుముక్కల్లా చేసుకుని వాడితే త్వరగా ఫలితం ఉంటుంది. ఇందుకోసం ముందుగా గ్రీన్ టీని తయారు చేసుకోవాలి. దీన్ని ఐస్ ట్రేలో వేసి ఫ్రీజర్‌లో ఉంచాలి. ఐసు ముక్కల్లా తయారయ్యాక కళ్లపై పెట్టుకుంటే చాలు.. లేదంటే ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగేసినా కళ తగ్గిన ముఖంలో ఎంతో మార్పు కనిపిస్తుంది.
*
మేకప్ వేసుకోవడానికి చాలా సందర్భాల్లో సమయం ఉండదు. అలాగని మేకప్ లేకుండా వెళ్లడం కూడా కొన్నిసార్లు బాగుండకపోవచ్చు. ఇలాంటప్పుడు ఒకటి రెండు ఐసు ముక్కల్ని తీసుకుని ముఖంపై రుద్దుకోవాలి. ముఖంలో రక్తప్రసరణ పెరిగి, చాలా తక్కువ సమయంలోనే తాజాగా మారిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల ముడతల ప్రభావం కూడా తగ్గుతుంది. ఎండవల్ల కమిలిన చర్మం సమస్య కూడా చాలా మటుకూ తగ్గుతుంది.
*
చర్మాన్ని మెరిపించాలనుకుంటున్నారా.. కీరదోస ఐసు వాడి చూడండి. కీరదోస గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలపాలి. తరవాత ఐస్‌ట్రేలో వేసి ఫ్రీజర్‌లో ఉంచేయాలి. ఈ మిశ్రమం ఐసుముక్కల్లా అయ్యాక ముఖం, మెడకూ రాసుకోవాలి. ఐదు నిమిషాల తరవాత కడిగేసుకుంటే చాలు. ఇది మురికిని తొలగించి, ముఖాన్ని శుభ్రపరుస్తుంది. చర్మం కాంతిమంతమవుతుంది.
*
కలబంద గుజ్జును ఐస్‌ట్రేలో వేసి ఫ్రీజర్‌లో ఉంచేయాలి. తరవాత ముఖానికి రాసుకుని నెమ్మదిగా మర్దన చేయాలి. ఎండవల్ల కమిలిన చర్మం తాజాగా మారుతుంది. చర్మంపై వేడి ప్రభావం కూడా తగ్గుతుంది.
*
కళ్ల అడుగున నల్లని వలయాలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఓ పని చేయండి. గులాబీ నీటిని గోరువెచ్చగా చేసి అందులో కీరదోస రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌ట్రేలో వేసుకోవాలి. తరవాత ఆ ఐసు ముక్కలను కళ్లపై పెట్టుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కళ్ల అడుగున వలయాలు దూరం కావడమే కాదు, ఉబ్బిన కళ్ల సమస్య కూడా తగ్గుతుంది. అయితే ఈ మిశ్రమాన్ని ఐస్‌ట్రేలో వేసేముందు గులాబీనీరు చల్లగా ఉండేలా చూసుకోవాలి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







