'జక్కన్న' టీజర్ పై ఓ లుక్కేయండి
- June 17, 2016
కృష్ణాష్టమి చిత్రం తర్వాత సునీల్ చేస్తున్న తాజా ప్రాజెక్ట్ 'జక్కన్న'. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కథానాయికగా మన్నారా చోప్రా నటిస్తోంది. సుదర్శన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య సునీల్ కు సరైన హిట్స్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ని చాలా ప్రస్టేజీయస్ గా తీసుకొని పూర్తి చేస్తాడు సునీల్. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్ మూవీపై భారీ అంచనాలు పెంచడంతో టీజర్ ని కూడా అదే రేంజ్ లో రెడీ చేసారు. తాజాగా జక్కన్న చిత్ర టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. సునీల్ మార్క్ కామెడీని కలిపి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.
త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







