సలాలాలో ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్ ప్రారంభం
- August 24, 2024
మస్కట్: సలాలాలోని విలాయత్‌లో హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్, ధోఫర్ ఖరీఫ్ సీజన్ 2024తో కలిసి ప్రారంభమైంది. ఆగస్టు 26 వరకు జరిగే ఈ ఫెస్టివల్‌లో అనేక మంది ఒమానీ, గల్ఫ్ చెఫ్‌ల ప్రత్యక్ష ప్రదర్శనలతో సహా వివిధ కార్యకలాపాలు ఉన్నాయి. అనేక లిటిల్ చెఫ్ కార్నర్, సాంప్రదాయ సంగీత జానపద ప్రదర్శనలు, వివిధ పోటీలు నిర్వహించనున్నారు. సాంప్రదాయ ఒమానీ ఆహారాలను అందించే రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు.
ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్ ఫోరమ్‌లు, ఫెస్టివల్స్, ఈవెంట్‌ల ద్వారా స్థానికంగా, ప్రాంతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ టూరిజంను ప్రోత్సహించడం ముఖ్యంగా ఒమానీ పాక కళలు, ఒమానీ వంటకాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమ ఉద్దేశం అని నిర్వాహకులు ప్రకటించారు. ఫెస్టివల్ ప్రారంభ వేడుకను ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ ఫైసల్ బిన్ అబ్దుల్లా అల్ రావాస్ స్పాన్సర్ చేశారు.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







