బహ్రెయిన్‌లో 'మెడిసిన్ కొరత'పై నిపుణులు ఏమన్నారంటే?

- August 26, 2024 , by Maagulf
బహ్రెయిన్‌లో \'మెడిసిన్ కొరత\'పై నిపుణులు ఏమన్నారంటే?

మనామా: బహ్రెయిన్ లో కొనసాగుతున్న మెడిసిన కొరత కారణాలను ఫార్మసీ ఓనర్స్ హెడ్ డాక్టర్ ఖలీద్ అల్ అవధి వివరించారు. మెడిసిన్ పేటెంట్ ముగిసిన సమయంలో, చౌకైన సాధారణ ప్రత్యామ్నాయాలు మార్కెట్ లోకి వస్తాయన్నారు. కొన్నిసార్లు అసలు కంటే ఎనిమిది రెట్లు తక్కువ ఖర్చు తో ఇవి ఉంటాయన్నారు. దాంతో ధరలను తగ్గినప్పటికీ, కంపెనీలు ఉత్పత్తి తగ్గించడంతో బహ్రెయిన్ లో మెడిసిన్ కొరత ఏర్పడిందన్నారు. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (NHRA) కఠినమైన చర్యలు తీసుకుంటున్నా.. బహ్రెయిన్ మార్కెట్‌లోకి ప్రవేశించకుండా జెనరిక్స్‌ను అడ్డుకోవడంలో సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. త్వరలో రాబోయే జాతీయ ఆరోగ్య బీమా కార్యక్రమం పరిస్థితిని సులభతరం చేయగలదని డాక్టర్ అల్ అవధి తెలిపారు. గత త్రైమాసికంలో ధరల సవరణలు లేకపోవడం వల్ల కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలకు మార్కెట్‌ను భరించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.దిగుమతి నిబంధనలు సడలించినప్పటికీ, లాభదాయకత ప్రధాన అడ్డంకిగా ఉందని ఆయన అంగీకరించారు. గ్లోబల్ ఎకానమీ నుండి వచ్చే ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా, కంపెనీలు తమ ధరలు ఆమోదయోగ్యమైన మార్జిన్‌ను మించి ఉంటే తరచుగా తిరస్కరణను ఎదుర్కొంటాయని వివరించారు. ప్రతి స్టాక్ కీపింగ్ యూనిట్ (SKU)ని నమోదు చేసుకోవడానికి 500 దినార్ల అవసరం, ఇది ఔషధ కంపెనీలపై మరింత ఆర్థిక ఒత్తిడిని పెంచుతుందని పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com