1,820 తనిఖీలు..150మందిపై బహిష్కరణ వేటు.. LMRA

- September 03, 2024 , by Maagulf
1,820 తనిఖీలు..150మందిపై బహిష్కరణ వేటు.. LMRA

మనామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) తనిఖీలన ముమ్మరం చేసింది. ఆగస్టు 25 నుండి 31 వరకు 1,820 తనిఖీ క్యాంపెయిన్ లను నిర్వహించింది. ఈ సందర్భంగా రెసిడెన్సీ చట్టాల నిబంధనలు ఉల్లంఘించిన 48 మందిని అదుపులోకి తీసుకోగా.. 150 మందిపై బహిష్కరణ వేటు వేశారు. అన్ని గవర్నరేట్‌లలోని వివిధ దుకాణాలపై 1,808 తనిఖీలు చేసినట్టు అధికార యంత్రాంగం తెలిపింది.  జాతీయత, పాస్‌పోర్ట్‌లు మరియు నివాస వ్యవహారాలు (NPRA), మరియు గవర్నరేట్ సంబంధిత పోలీసు డైరెక్టరేట్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ వెర్డిక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ సెంటెన్సింగ్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ద్వారా ప్రాతినిధ్యం వహించే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సహ పలు మంత్రిత్వ శాఖలు తనిఖీలలో పాల్గొన్నట్లు తెలిపింది.   అధికార వెబ్‌సైట్ http://www.lmra.gov.bhలో ఎలక్ట్రానిక్ ఫారమ్ ద్వారా లేదా అధికారానికి కాల్ చేయడం ద్వారా చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులను తెలిపి మద్దతు ఇవ్వాలని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ పిలుపునిచ్చింది. 17506055 లేదా ప్రభుత్వ సూచనలు, ఫిర్యాదుల వ్యవస్థ (తవాసుల్) ద్వారా కాల్ సెంటర్ కు తెలియజేయాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com